వివాదస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన సాయిపల్లవి..!

‘విరాటపర్వం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటి సాయిపల్లవి కశ్మీర్ పండిట్స్, గోహత్యలపై వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆమె వ్యాఖ్యలపై భజరంగ్ దళ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో సాయిపల్లవి తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. 

‘గత కొన్ని రోజుల నుంచి నాపై వస్తున్న విమర్శలు, నా వ్యాఖ్యలను వక్రీకరించి చేస్తున్న ప్రచారినికి సంబంధించి స్పష్టత ఇచ్చేందుకు మీ ముందుకొచ్చారు. ఇప్పుడు నా అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. నా మాటల వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు..నా మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి’ అంటూ సాయిపల్లవి కోరారు. 

‘నేను ఇచ్చిన ఇంటర్వ్యూను పూర్తిగా చూడకుండా.. చిన్న క్లిప్ చూసి మీడియాలో నా వ్యాఖ్యలను ప్రచారం చేశారు. పూర్తిగా చూసి ఉంటే నేను అలా ఎందుకు మాట్లాడానో అర్థమయ్యేది. ఆ ఇంటర్వ్యూలో మీ మద్దతు రైట్ వింగ్ కా, లెఫ్ట్ వింగ్ కా అని అడిగారు. దానికి సమాధానంగా నేను.. వారికి వీరికి అని కాదు.. మనం మంచి మనుషులా జీవించాలనే ఉద్దేశంతోనే కశ్మీర్ ఫైల్స్, గోరక్షకుల దాడి అంశాలను ప్రస్తావించాను. మెడికల్ గ్రాడ్యుయేట్ గా నాకు ప్రాణం విలువ తెలుసు..ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలోనూ నాకు మద్దతుగా ఉన్న వారికి థ్యాంక్స్’ అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. 

 

Leave a Comment