‘జగన్ ముందు జోకర్లయ్యాం’.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో సినిమా రేట్ల విషయంలో అప్పట్లో నానా హంగామా జరిగింది. సీఎం జగన్ ని ఒప్పించేందుకు ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. రేట్లు పెంచితే ప్రజలకు ఇబ్బంది అవుతుందని సీఎం జగన్ చెప్పినా.. ఎలాగోలా ఒప్పించారు. తీరా రేట్లు పెంచాకా.. ఇప్పుడు నాలుక కరుచుకుంటున్నారు.. 

సినిమా రేట్లు పెరగడంతో జనాలు థియేటర్లకు రావడం తగ్గించారు. దీంతో జనాలను థియేటర్లకు రప్పించేందుకు టికెట్ రేట్లు తగ్గిస్తూ ఇండస్ట్రీ ఇప్పుడు నానా తంటాలు పడుతోంది.. ఈ విషయంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్ చేశారు. కొండా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో టికెట్ రేట్ల గురించి తన స్టయిల్ లో సమాధానం చెప్పారు. 

సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఏపీ సీఎం జగన్ ముందు జోకర్లయ్యాం అని ఆర్జీవీ అన్నారు. ఇది జగన్ విజయమని, ఇంకా తమ నిర్ణయం సరైందే అని సమర్థించుకోవడం మూర్ఖత్వమే అని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఏదో ఆవేశంలో రేట్లు పెంచమన్నామని, దీంతో ప్రభుత్వం కూడా పెంచిందని తెలిపారు. కానీ ఆ తర్వాతే అంతా రివర్స్ అయ్యిందన్నారు. టికెట్ రేట్లు అందుబాటులో ఉంటేనే ప్రజలు సినిమాకు వస్తారని జగన్ చెప్పారని, కానీ తాము ఏదో మమ్మల్ని తొక్కేస్తున్నారని అనుకున్నామని అన్నారు. కానీ ఇప్పుడు తామే టికెట్ రేట్లు అందుబాటులో లేవు కాబట్టే ఎవరూ థియేటర్లకు రావడం లేదని రియలైజ్ అయ్యామని, నిజంగా ఇది తమ బ్లండర్ మిస్టేక్ అని కుంబ బద్దలు కొట్టారు.. 

Leave a Comment