ఉత్తమ అధికారిగా అవార్డు తీసుకున్నాడు..కట్ చేస్తే.. లంచం తీసుకుంటూ ఏసీబీకీ చిక్కాడు..!

అతనో ప్రభుత్వ అధికారి.. గణతంత్ర దినోత్సవం రోజున ఉత్తమ అధికారిగా అవార్డు కూడా తీసుకున్నాడు.. కొద్ది రోజుల్లోనే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.. అతడే వెలుగు ఏపీఎం గోవిందరావు.. విశాఖ జిల్లా గొలుగొండ మండలంలో టి.గోవిందరావు వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్నాడు. 

డీఆర్డీఏకి చెందిన వైఎస్ఆర్ కాంతి పథకంలో విధులు నిర్వహిస్తున్న వీఓఏలకు మూడు, నాలుగు నెలలకోసారి జీతాలు వస్తాయి. వీరి జీతాల బిల్లులను ఏపీఎం పాస్ చేయాల్సి ఉంటుంది. వేతనాల బిల్లులను పాస్ చేసేందుకు ఏపీఎం వారి వద్ద రూ.14 వేలు డిమాండ్ చేశాడు. దీంతో లింగందొరపాలెం పంచాయతీకి చెందిన వీఓఏ దేవి.. అనిశా అధికారులకు సమాచారం ఇచ్చింది. 

ఏసీబీ అధికారుల ప్లాన్ ప్రకారం దేవి తన భర్త అప్పలనాయుడుతో కలిసి సోమవారం ఏపీఎం గోవిందరావుకు రూ.14 వేలు అందజేశారు. అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు గోవిందరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు..  

 

Leave a Comment