ఎలక్ట్రికల్ స్కూటీ వాడుతున్నారా.. జాగ్రత్త..! ఛార్జింగ్ చేస్తుండగా పేలిన బ్యాటరీ..!

ఎలక్ట్రికల్ స్కూటీ వాడుతున్నారా? అయితే ఛార్జింగ్ పెట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఎందుకంటే ఉన్నట్టుండి ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీలు పేలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో ఛార్జింగ్ ఎక్కుతున్న సమయంలో ఓ ఎలక్ట్రికల్ స్కూటీ బ్యాటరీ పేలిపోయింది. దీంతో ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం కాలిపోయింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. 

వివరాల మేరకు కుత్బుల్లాపూర్ సర్కిల్ చింతల్ భగత్ సింగ్ నగర్ కి   చెందిన సాయికుమార్ రెడ్డి అనే వ్యక్తి సేల్స్ మార్కెటింగ్ చేస్తుంటాడు. అతడు ఇటీవల ఓ ఎలక్ట్రిక్ స్కూటీని కిరాయికి తీసుకున్నాడు. దానికి ప్రతి రోజూ రూ.150 చెల్లిస్తున్నాడు. మంగళవారం రాత్రి తన ఇంట్లోని ఓ గదిలో ఆ స్కూటీకి ఛార్జింగ్ పెట్టి నిద్రపోయాడు.. 

బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో విద్యుత్ తీగలు కాలిపోయినట్లు స్పెల్ వచ్చింది. దీంతో సాయికుమార్ కి మేలకువ వచ్చింది. వెంటనే లేచి పక్క గదిలోని స్విచ్ ఆన్ చేసే లోపే స్కూటీ బ్యాటరీ పేలిపోయింది. దీంతో మంటలు ఎగిసిపడి ఇంట్లోని సామగ్రి కాలి బూడిదైపోయింది.. స్థానికులు కిటికీల నుంచి నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు.. బ్యాటరీ పేలిన సమయంలో ఆ గదిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.  

Leave a Comment