కరోనా కట్టడిలో ఏపీ బాగా పనిచేస్తోంది : కేంద్ర కమిటీ

కోవిడ్-19 వైరస్ కట్టడికి చాలా అంశాల్లో, టెస్టింగ్ లో ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా బాగా చేస్తోందని  సెంట్రల్ టీమ్ ప్రతినిధులు ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ మధుమిత దూబే చెప్పారు. ఆదివారం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కోవిడ్-19 కట్టడి పై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. కోవిడ్ కంట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, కర్నూలు జిల్లా యంత్రాంగానికి చేయూతనివ్వడానికి వచ్చామని అన్నారు. 

కర్నూలు జిల్లాలో పరిస్థితులను పూర్తీగా పరిశీలించి.. కోవిడ్ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కర్నూలు జిల్లా యంత్రాంగానికి సలహాలు, సూచనలు, ఇస్తామన్నారు. కోవిడ్-19 వైరస్ కట్టడికోసం, కొత్త ఛాలెంజ్ ను ఎదుర్కోవడంలో  కర్నూలు జిల్లా యంత్రాంగం బాగా కృషి చేస్తోందన్నారు.  భవిష్యత్తులో అనుకోనివి జరిగినా..అటువంటి ఛాలెంజ్ లను పగడ్బందీగా ఎదుర్కోవడానికోసం.. క్వారంటైన్ లు, కోవిడ్ కేర్ సెంటర్లు, హాస్పిటల్స్, హ్యూమన్ రిసోర్సెస్ సన్నద్ధతను ఇంకా పెంచుకోవాలని మధుమిత పేర్కొన్నారు. 

కరోనా కలిసి జీవించే విధంగా మార్పు తీసుకురావాలి..

సెంట్రల్ టీమ్ సభ్యులు ప్రొఫెసర్ సంజయ్ కుమార్ సాధూఖాన్  మాట్లాడుతూ… లాక్ డౌన్ ఎంతో కాలం ఉండదని, ఏదో ఒక రోజు లాక్ డౌన్ ను తీసేస్తారని, అందువల్ల కోవిడ్ వైరస్ తో కలిసి జీవించే విధంగా ప్రజల ఆలోచనలో మార్పు తీసుకురావాలని సూచించారు. కోవిడ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం, కర్నూలు జిల్లా యంత్రాంగం ప్రశంసనీయ కృషి చేస్తుందన్నారు.  కోవిడ్ వైరస్ పై విజయాన్ని సాధించడానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు

జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కోవిడ్ వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం గత నెలన్నర నుండి అహర్నిశలు నిద్ర లేకుండా కృషి చేస్తుందని, వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. కేంద్ర బృందం సభ్యులు ఇచ్చే ఎంతో విలువైన సలహాలు, సూచనలను పాటించి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు  కృషి చేస్తామని కలెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు. 

 

Leave a Comment