ఆడవాళ్లు తొడలు కొడతారు.. మగాళ్లు ఏడుస్తారు.. టీడీపీ ఓ ‘జంబలకిడి పంబ’ పార్టీ.. మంత్రి రోజా!

సీఎం జ‌గ‌న్ కటౌట్ చూస్తేనే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయ‌ని ఏపీ మంత్రి రోజా అన్నారు. వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఒక పండుగలా ప్లీనరీ జరుపుకుంటున్నామన్నారు. జనం మెచ్చిన నాయకుడు జగన్ అన్నారు. ఈ జనసందోహం చూస్తుంటే.. ఇది ప్లీనరీలా కనిపించడం లేదని, రెండేళ్ళ తర్వాత జగన్ అనే నేను.. అంటూ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ చేయబోయే ప్రమాణస్వీకారానికి రిహార్సల్ గా కనిపిస్తోందని తెలిపారు. 

వైసీపీ మిగతా అన్ని పార్టీ లాంటిది కాదని, దేశ రాజకీయాలను శాసించిన సోనియా గాంధీనే గడగడలాడించిన పార్టీ అని మంత్రి రోజా అన్నారు. వెన్నుపోటు వీరు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టించిన పార్టీ అన్నారు.  

కాన్ఫిడెన్స్ కి కటౌట్..

‘జగన్ ని చూస్తే.. కాన్ఫిడెన్స్ కు కటౌట్ వేస్తే.. ఎలా ఉంటుందో అలా ఉంటారు. జగన్ కటౌట్ చూస్తేనే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయి. ఆశయం కోసం వేటాడే పులి ఈ పులివెందుల బిడ్డ జగన్. నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న ప్రజల కోసం.. ఎంత దూరమైన వెన్ను చూపకుండా పోరాడే ఒకే ఒక్క నాయకుడు జగన్ మోహన్ రెడ్డి’.

టీడీపీ జంబలకడి పంబ పార్టీ..

‘జగన్ భయపెట్టాలని, రాష్ట్రం నలుమూలల నుంచి దొంగలంతా ఒకచోటికి చేరి మీటింగులు పెడుతున్నారు. జగన్ ను భయపెట్టాలంటే మీరు మరో జన్మ ఎత్తాలి. గత ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కాలేడు అన్న…  పవన్ కల్యాణ్ ను శాసన సభ గేటు కూడా తాకనివ్వకుండా చేశారు. చంద్రబాబు, పవన్ లకు దమ్ము, ధైర్యం ఉంటే.. వారిలో ఆంధ్రప్రదేశ్ రక్తమే ప్రవహిస్తుంటే.. విడివిడిగా జగనన్నతో పోటీకి వస్తారా’.. అంటూ రోజా సవాల్ విసిరారు.

‘ ఒక పార్టీకేమో పోటీ చేయడానికి క్యాండేట్లు లేరు.. మరో పార్టీ నాయకుడు రెండు చోట్ల పోటీ చేస్తే.. రెండు చోట్లా ఓడిపోయాడు. టీడీపీని చూస్తే.. ఈ జంబలకడి పంబ పార్టీ ఏమిటి.. అనిపిస్తోంది. ఆ పార్టీలో ఆడవాళ్ళు తొడలుగొడతారు.. మగవాళ్ళు ఏడుస్తారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు తొడగొడితే.. చంద్రబాబు గుండె ఆగిపోతుంది. తెలుగుదేశం, జనసేన పార్టీలు అయినా.. డైరెక్ట్ గా ఫైట్ చేయాలిగానీ.. గుంపులు గుంపులుగా వస్తే.. వాళ్ళు లీడర్లు అనిపించుకోరు. ఒకాయన కొడుకును గెలిపించుకోలేదు. మరోకాయన రెండు చోట్ల ఓడిపోయాడు. 2024 ఎన్నికల్లో జగనన్న వన్స్ మోర్.. అన్న నినాదంతో.. 175కు 175 సీట్లు గెలిపించాలి’ అని మంత్రి రోజా పిలుపునిచ్చారు. 

 

 

Leave a Comment