8 మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు..!

కోర్టు ధిక్కరణ కేసులో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఏపీలోని 8 మంది ఐఏఎస్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈక్రమంలో వీరికి రెండు వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 

అయితే సదరు ఐఏఎస్ అధికారులు ధర్మాసనాన్ని క్షమాపణలు కోరారు. దీంతో వారి శిక్షను ధర్మాసనం తగ్గించింది. జైలు శిక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వారిని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఏడాది పాటు ప్రతి నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా ఒకరోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్ లు గోపాల కృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, ఎం ఎం నాయక్ శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, విజయ్ కుమార్, శ్యామల రావు, వాడ్రేవు చిన వీరభద్రుడులను ఆదేశించింది. 

Leave a Comment