ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ రెండు జీవోలను సవాల్ చేస్తూ ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఏ మీడియం చదువుకోవాలి అనేది పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ణయిస్తారని ప్రభుత్వ జీఓను సవాలు చేస్తూ న్యాయవాది ఇంద్రనీల్ సైతం పిల్ దాఖలు చేశారు. ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తే కొందరి బ్యాక్ లాగ్‌లు మిగిలిపోయే ప్రమాదం ఉందని న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై ఇటీవల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన 81, 85 జీఓలను కొట్టేస్తూ హైకోర్టు నేడు తీర్పునిచ్చింది.

 

Leave a Comment