ర్యాంకులను ప్రచారం చేస్తే చర్యలు.. ప్రైవేట్ స్కూళ్లకు జగన్ సర్కార్ వార్నింగ్..!

పదో తరగతి ఫలితాలు విడుదలైతే చాలు.. విద్యాసంస్థలు ర్యాంకులతో ఊదరగొడుతుంటాయి. విపతీరమైన యాడ్స్ తో తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇలాంటి ప్రచారాలు చేసే విద్యాసంస్థలు, ట్యూటోరియల్ సంస్థలకు ఏపీ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఊదరగొట్టే ప్రకటనలతో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 

ర్యాంకుల ప్రకటనలపై నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల యాజమాన్యాలకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమాన విధిస్తామని స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీ చేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ జీవో చేరి చేసింది.

పదో తరగతి పరీక్షల్లో గ్రేడ్లకు బదులు మార్కులతో ఫలితాలు ప్రకటించనున్న కారణంగా ఆయా సంస్థలు ర్యాంకులతో తప్పుడు ప్రకటనలు చేయరాదని స్పష్టం చేసింది. కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ తమ సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయంటూ టీవీల్లో ప్రకటనలు ఇస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

Leave a Comment