గ్రామవాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం షాక్..వెంటనే వారిని తొలగించాలని ఉత్తర్వులు..!

గ్రామ, వార్డు వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 18 సంవత్సరాల లోపు, 35 సంవత్సరాలు నిండిన ఉద్యోగులను విధుల నుంచి తొలగించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్వర్వులను గ్రామ వాలంటీర్ సచివాలయం, వార్డు వాలంటీర్ సచివాలయం శాఖ డైరెక్టర్, కమిషనర్ జీఎస్. నవీన్ కుమార్ జారీ చేశారు.  తాజా ప్రకటనతో ఒక్కో జిల్లాలో 2 వేల నుంచి 10 వేల వరకు వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం ఉద్వాసన పలకనుంది.

 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గతేడాది ఆగస్టులో 2.60 లక్షల మందిని గ్రామ, వార్డు వాలంటీర్లుగా నియమించింది. సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ని నియమించారు. వీరిలో ఇప్పటికే 35 ఏళ్లు నిండి వాలంటీరుగా పనిచేస్తున్న వారికి సీఎఫ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా జీతాలు రావడం లేదు. గత కొంత కాలం నుంచి ఈ అంశం చర్చనీయాంశమైంది. 35 ఏళ్లు నిండిన వారెవరైనా ఉంటే వారిని విధుల నుంచి తొలగించాల్సిందిగా కమిషనర్ తాజాగా ఉత్వర్వులు ఇచ్చారు. 

Leave a Comment