‘ఏలియన్స్ తో అమెరికా ఒప్పందం’.. ఇజ్రాయేల్ స్పేస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు..!

ఈ విశాలమైన విశ్వంలో మనుషులతో పాటు ఏలియన్స్ కూడా ఉన్నాయని ఎప్పటి నుంచో వింటున్నాం. ఏలియన్స్ మీద ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అవి మంచి విజయాలు కూడా సాధించాయి. విశ్వంలో గ్రహాంతర వాసులు ఉన్నాయని ఎప్పటి నుంచో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అంతే కాదు ఏరియా 51 అనే ప్రాంతంలో అమెరికా సైన్యం గ్రహాంతరవాసులను బంధించి పెట్టిందని, వాళ్ల నుంచి అధునాతన టెక్నాలజీని ఆ దేశం పొందుతోందని ఆరోపణలు ఉన్నాయి. 

ఈక్రమంలో ఇజ్రాయేల్ అంతరిక్ష భద్రత విభాగం మాజీ జనరల్ హైమ్ ఎషెడ్ ఏలియన్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఏలియన్స్ తో అమెరికా రహస్యంగా గాలాక్టిక్ ఫెడరేషన్ ఒప్పందం చేసుకుంది. అమెరికాలో మనుషుల మధ్య ఏలియన్స్ కూడా రహస్యంగా తిరుగుతున్నాయి. 

అంగారక గ్రహంలో అండర్ గ్రౌండ్ లో ఏలియన్స్ ఉన్నాయి. ఏలియన్స్ గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తెలుసు. ఈ విషయాన్ని ఆయన బహిర్గతం చేయాలనుకున్నారు. అయితే గాలాక్టిక్ ఫెడరేషన్ ఒప్పుకోలేదు.’ అంటూ ఎషఎడ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.    

Leave a Comment