మా చిన్నారి నిహారికకు శుభాకాంక్షలు … చిరు ట్వీట్ వైరల్..

మెగా డాటర్ నిహారిక, చైతన్య వివాహం డిసెంబర్ 9న బుధవారం రాత్రి 7 గంటలకు ఉదయ్ పూర్ ప్యాలెస్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలిలో పెళ్లి సందడి మొదలైంది. ఇందుకోసం మెగా కుటుంబం, బంధువులు, టాలీవుడ్ ప్రముఖులు రాజస్థాన్ చేరుకుంటున్నారు. 

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టారు. చిన్నారి నిహారికను ఆయన ఎత్తుకుని ఉన్న ఫొటోతో పాటు పెళ్లి కూతురుగా ముస్తామైన ఇప్పటి నిహారిక ఫొటోను షేర్ చేశారు. కాబోయే నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికను, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో ముందుస్తుగా కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు’ అంటూ ఆశీర్వదించారు.   

Leave a Comment