పింఛన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం రికార్డు..

లబ్ధిదారులకు ఇంటి వద్ద పెన్షన్ అందజేసే విషయంలో ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు 47 లక్షల మందికి ఇళ్ల వద్దే పెన్షన్లు అందజేశారు. దీంతో 80 శాతం మందికి పెన్షన్ల పంపణీ పూర్తయిందంటున్నారు అధికారులు. గ్రామ వలంటీర్లు పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ఆదేశించారు. మారుమూల ప్రాంతాల్లో కూడా రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దీంతో మార్చి 1న లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు గ్రామ వలంటీర్లు. అర్హులైనప్పటికీ గత నెలలో పెన్షన్లు అందని వారికి ఇప్పుడు రూ.4,500 అందజేశారు. పెన్షన్ల పంపిణీపై రియల్ టైమ్ డేటా నమోదవుతోంది. జిల్లాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్స్ ద్వారా క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం కార్యదర్శులు, కలెక్టర్లు, ఇతర అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికీ 50 లక్షల మందికి పెన్షన్లు అందించినట్లుగా చెబుతున్నారు. 

Leave a Comment