సీబీఐకి అంతర్వేది రథం దగ్ధం కేసు..!

 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్వేది రథం దగ్ధం కేసు అతలాకుతలం చేస్తున్నది. వివిధ హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు రథం దగ్ధం కేసు విషయంలో సీరియస్ కావడం, ఛలో అంతర్వేది కార్యక్రమాన్ని తలపెట్టిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఒక్కరిసారిగా ఉద్రిక్తకరంగా మారింది. దీంతో అంతర్వేదిలో 144 సెక్షన్ విధించారు. 

ఈనేపథ్యంలో అంతర్వేది రథం దగ్ధం కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈమేరకు శుక్రవారం జీవో జారీ చేసింది. సెక్షన్ 6, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ప్రకారం సీబీఐ ఈ కేసును విచారించాలని కోరింది. సీబీఐ దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి. 

 

Leave a Comment