గుండు లుక్ లో మెగాస్టార్ చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ చూడని కొత్త లుక్ లో కనిపించారు. ఇటీవల మీసాలు లేకుండా కనిపించిన చిరు…తాజాగా గుండుతో దర్శనమిచ్చి అభిమానులకు షాక్ ఇచ్చారు. బ్లాక్ గాగుల్స్ కంప్లీట్ గా నున్నటి గుండుతో దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దానికి ‘నేను సన్యాసిలా ఆలోచించగలను’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. 

అయితే చిరంజీవి..కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’ సినిమా కోసం గుండు చేయించుకున్నారా? లేక తర్వాతి సినిమా కోసం కొత్త లుక్ కోసం గుండు గీయించుకున్నారా అనేది చూడాలి..ఏదేమైనా చిరంజీవి గుండుతో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. మొత్తంగా చిరంజీవి గుండు లుక్ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

 

View this post on Instagram

 

#UrbanMonk Can I think like a monk?

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

Leave a Comment