తల్లికి తగ్గ కూతురు అనిపించుకున్న రోజాకూ కుమార్తె..!

వైసీపీ ఎమ్మెల్యే, జబర్దస్త్ కామెడీ షో జడ్జి రోజా కూతురు అన్షుమాలిక తల్లికి తగ్గ తనయ అనిపించుకుంది. అన్షు యూట్యూబర్ గా, రచయితగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.. తాజగా అన్షుమాలికకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత Influencer-UK మ్యాగజైన్ కవర్ పేజీపై అన్షుమాలిక ఫొటోను ప్రచురించింది. అన్షు రచయితగా, ఎంట్రప్రెన్యుయర్ గా, ప్రోగ్రామర్ గా సమాజం కోసం పాటుపడుతున్నందుకు యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపికైనట్లు Influencer ప్రకటించింది.  

తనకు అరుదైన గుర్తింపు దక్కడం పట్ల అన్షు స్పందించింది. తన కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేసింది. ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై క్వీన్ ఆఫ్ టాలెంట్ గా అన్షు ఫొటో వేశారు. రీసెంట్ గా అన్షు మాలిక తన పుట్టినరోజు జరుపుకుంది. ఈ ఈవెంటన్ ను రోజా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది.  అన్షు ప్రస్తుతం చదువుకుంటోంది. ఓవైపు చదువుకుంటూనే సోషల్ మీడియాలో సెలబ్రెటీగా మారింది. సొంత యూట్యూబ్ చానల్ నడుపుతూనే సోషల్ సర్వీస్ లోనూ చురుగ్గా పాల్లొంటుంది.

 

Leave a Comment