ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా..ఎక్కడో తెలుసా?

మహాత్మగాంధీ 152వ జయంతి సందర్భంగా లడఖ్ లోని లేహ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జెండాను ఆవిష్కరించారు. ఈ జాతీయ జెండాను లడఖ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆర్కే బథుర్ ఎగురవేశారు. ఖాదీ నూతుతో తయారు చేసిన ఈ జెండా సుమారు 225 ఫీట్ల పొడువు, 150 ఫీట్ల ఎత్తు ఉంది. ఈ జెండా సుమారు 1000 కిలోల బరువు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇండియన్ ఆర్మీకి చెందిన 57 మంది ఇంజనీర్ రెజిమెంట్ ఈ జాతీయ జెండాను తయారు చేశారు. 

కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ జాతీయ జెండా వీడియోను తన ట్విట్టర్ లో పంచుకున్నారు. ‘గాంధీ జయంతి రోజున అతిపెద్ద ఖాదీ తిరంగా ఎగరడం గర్వంగా ఉంది. బాపూను స్మరించిన తీరును సెల్యూట్ చేస్తున్నా. ఇది భారతీయ చేనేత కళాకారులను ప్రోత్సహిస్తుంది. జాతీ ఔనత్యాన్ని పెంచుతుంది. జై హింద్..జై భారత్’ అంటూ ట్విట్ లో పేర్కొన్నారు. ఇక కొండపై ప్రదర్శనకు ఉంచిన జెండా, కొండ మీదుగా వెళ్తున్న హెలికాప్టర్లు ఈ వీడియో కనిపిస్తాయి.  

 

Leave a Comment