ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా..!

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 26 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఈనెల 4న సీఎం జగన్ వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించారు. అయితే ఈ జిల్లాల ఏర్పాటు విషయంలో కొన్ని ప్రాంతాల వారు అసంతృప్తితో ఉన్నారు. తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందంటూ అసహసం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త జిల్లా ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఆ కొత్త జిల్లా కూడా గిరిజన ప్రాంతాలతోనే ఏర్పాటు అవుతుందన్నారు. దీంతో 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందని పేర్ని నాని చెప్పారు. రంపచోడవరం, పొలవరం ముంపు గ్రామాలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Comment