వాతావరణ కేంద్రం హెచ్చరిక.. దూసుకొస్తున్న మరో అల్పపీడనం..!

గత పదిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టాయి. తెలంగానలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురవగా.. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్సాలు కురిశాయి. తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేసిన వరుణుడు కాస్త శాంతించాడు. ఇప్పుడిప్పుడే పొడి వాతావరణం కనిపిస్తోంది. ఈక్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో అల్పపీన వార్తను తెలిపింది. 

ఈనెల 11న ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈనెల 12న తిరిగి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ బూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోనూ ఉంటుంది. అల్పపీడన ప్రభావంతో విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్లరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి 40-50 కీలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్లరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాక చెబుతోంది. 

 

Leave a Comment