జియో నుంచి మరో బంపర్ ఆఫర్

రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రం హోం చేసే వారికి హై స్పీడ్ డేటా ప్రయజనాలను అందిస్తున్నట్లు చెప్పింది. రూ.2,399 జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో 365 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో పాటు 2 జీబీ రోజు వారీ హై స్పీడ్ డేటాను అందిస్తుంది. ఇదే కాకుండా మూడు కొత్త వర్క్ ఫ్రం హోమ్ యాడ్ ఆన్ ప్యాక్ ఆఫర్లను కూడా తీసుకొచ్చింది. 

రూ.2,399 జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు..

తాజాగా ప్రకటించిన రూ.2,399 జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 2 జీబీ రోజు వారీ హై స్పీడ్ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్ లను 365 రోజుల పాటు అందిస్తుంది. ఇంతకు ముందు ఫిబ్రవరిలో జియో ప్రారంభించిన రూ.2,121 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1.5 జీబీ హై స్పీడ్ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్ లను 336 రోజుల పాటు మాత్రమే అందిస్తుంది. 

యాడ్ ఆన్ ప్యాక్స్…

జియో రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ కు అదనంగా కొత్తగా యాడ్ ఆన్ ప్యాక్ లను ప్రారంభించింది. ఈ యాడ్ ఆన్ ప్యాక్ లు రూ.151, రూ.201 మరియు రూ.251. రూ.151 ప్లాన్ కు 30 జీబీ అదనపు హైస్పీడ్ డేటాను ఇస్తుంది. రూ.201 ప్యాక్ 40 జీబీ డేటా, రూ.251 ప్యాక్ 50 జీబీ డేటాను అందిస్తుంది. వినియోగదారులు తమ డేటా అయినప్పుడు ఈ యాడ్ ఆన్ ప్యాక్ లను వినియోగించుకోవచ్చు. జియో ఇప్పటికే ఐదు యాడ్ ఆన్ ప్యాక్ ను కలిగి ఉంది. అవి 4జీ డేటా వోచర్లుగా అందుబాటులో ఉన్నాయి. అవి రూ.11, రూ.21, రూ.31, రూ.51 మరియు రూ.101.

Leave a Comment