బ్యాంకులకు రూ.400 కోట్ల టోకరా..పరారీలో డీఫాల్టర్లు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర బ్యాంకుల నుంచి రూ.400 కోట్లకు పైగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన ఓ సంస్థ నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. రుణాలు ఎగ్గొట్టడమే కాకుండా విదేశాలకు పారిపోయారు సంస్థ యజమానులు. ఢిల్లీకి చెందిన బాస్మతి బియ్యం ఎగుమతిదారులు రామ్ దేవ్ ఇంటర్నేషనల్ సంస్థ ఓనర్లు మొత్తం ఆరు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారు. అయితే సంస్థ యజమానులు 2016 నుంచి పరారిలో ఉన్నట్లు తేలింది. 

ఈ విషయంపై ఫిబ్రవరి 25న ఎస్బీఐ డీఫాల్టర్లపై ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 28న సీబీఐ కంపెనీ డైరెక్టర్లు నరేష్ కుమార్, సురేష్ కుమార్, సంగీతలపై కేసు నమోదు చేసింది. ఫోర్జరీ, చీటింగ్ వంటి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 

డీపాల్టర్లు ఎస్బీఐ నుంచి రూ.173.11 కోట్లు, కెనెరా బ్యాంకు నుంచి రూ.76.09 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.64.31 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.51.31కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి రూ.36.91కోట్లు, ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.12.27 కోట్లు అప్పులు తీసుకున్నారు. 

Leave a Comment