భర్త, కూతురు వద్దని.. ప్రియుడితో వెళ్లిన మహిళ.. ఇప్పుడు ఆది పరాశక్తి అవతారంలో..!

భర్త, కూతురును వద్దని ప్రియుడితో వెళ్లిన మహిళ తాజాగా ఆది పరాశక్తి అవతారమెత్తింది. కొత్త ఏడాది జనవరి 1న భక్తులకు ఉపదేశం ఇచ్చేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియాలో అన్నపూర్ణ మాతాజీ దర్శనానికి ఆహ్వానం పలికే వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ మాతాజీ ఎవరని పోలీసులు ఆరాతీస్తున్నారు.

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ లోని ఓ కల్యాణ మండపం వేదికగా అన్నపూర్ణి అరసు మాతాజీ జనవరి 1న దివ్యదర్శనం ఇస్తున్నారని, భక్తులకు ఉపదేశం చేస్తారని ఆహ్వానం పలుకుతూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. భక్తులు మాతాజీ అశీర్వచనాలు తీసుకోవడం, ఆమె పూనకం వచ్చినట్లు ఊగిపోవడం, భక్తుల కోరికలు తీర్చడం, వరాలు ఇవ్వడం వంటి అనేక వీడియోలు యూట్యూబ్ లో ప్రత్యక్షమయ్యాయి. 

దీంతో ఈ కొత్త మాతాజీ ఎవరబ్బా అని పోలీసులు ఆరాతీశారు. తెలుగులో ‘బతుకు జట్కా బండి’ షో మాదిరిగా.. తమిళ్ లో లక్ష్మీ రామకృష్ణన్ ఆలుమగల షో ప్రసారమైంది. 2014లో ప్రసారమైన లక్ష్మీ రామకృష్ణన్ రియాల్టీ షోలో ఆమెనే చివరిగా కనిపించిన బాధితురాలు.. ఈ షోలో జరిగిన చర్చలో తనకు భర్త, 14 ఏళ్ల కూతురి కన్నా.. ప్రియుడు అరసే ముఖ్యం అని స్పష్టం చేసి అతడితో వెళ్లిపోయింది. ఆ మహిళే ఈ అన్నపూర్ణ మాతాజీగా తేలింది. 

పోలీసులు ఆమె విషయంలో మరింత లోతుగా విచారించారు. ఈ విచారణలో గతంలో ఆమె ప్రియుడు అరసు అనుమానాస్పందంగా మరణించినట్లు తేలింది. పోలీసులు రంగంలోకి దిగడంతో అన్నపూర్ణ, ఆమె భక్తులు పరారయ్యారు. నిర్వాహకులు కూడా కార్యక్రమాన్ని రద్దు చేసుకుని.. తమ సెల్ ఫోన్లను స్విచాఫ్ చేశారు. మాతాజీని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళనాడులో ఈ అన్నపూర్ణ మాతాజీ వీడియోలు హాట్ టాపిక్ గా మారాయి.    

 

 

 

Leave a Comment