మ్యాచ్ జరుగుతుండగా.. గుండెపోటుతో యువ ఫుట్ బాలర్ మృతి..!

కేవలం 30 ఏళ్ల వయసులో అల్జీరియా ఫుట్ బాల్ క్రీడాకారుడు సోఫియానే లోకర్ గుండెపోటుతో కన్నుమూశాడు. లోకర్ మృతి పట్ల ఫుట్ బాల్ ప్రపంచం శోకసంద్రంలో ముగినిపోయింది. అల్జీరియా సెకండ్ డివిజన్ జట్టు మౌలౌడియా సైదా కెప్టెన్ గా లోకర్ వ్యవహరిస్తున్నాడు. వారం రోజుల క్రితమే లోకర్ వివాహం చేసుకోవడం గమనార్హం.. అసలు ఏం జరిగిందంటే..

క్రిస్మస్ రోజున ఓరాన్ అసోసియేషన్ తో మౌలౌడియా సైదా మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో సోఫియానే లోకర్ మైదానంలో కుప్పకూలిపోయాడు. మ్యాచ్ 26వ నిమిషంలో తన టీమ్ గోల్ కీపర్ తో లోకర్ ఢికొన్నాడు. దీంతో అతని తలకు గాయం అయింది. కొంతసేపటి తర్వాత తన గాయానికి చికిత్స తీసుకున్న లోకర్ ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించాడు. 

అయితే.. కేవలం 9 నిమిషాల తర్వాత.. మ్యాచ్ 35వ నిమిషంలో లోకర్ మరోసారి మైదానంలో కుప్పకూలాడు. వెంటనే వైద్య సిబ్బంది రంగంలోకి దిగి సీపీఆర్ నిర్వహించారు. నోటి నుంచి శ్వాస అందించే ప్రయత్నం చేశారు. కానీ లోకర్ ని మాత్రం రక్షించలేకపోయారు. లోకర్ మృతితో అల్జీరియా జట్టులో విషాదం నెలకొంది. ఈ విషాద ఘటన తర్వాత మ్యాచ్ ని రద్దు చేశారు.  

Leave a Comment