లెస్బియన్ గా మారిన అంజలి..!

ఈ రోజుల్లో హీరోయినట్లు ఎలాంటి ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికీ వెనుకాడట్లేదు. ఆ పాత్ర బోల్డ్ అయినా నటిస్తున్నారు. హాలీవుడ్ భామలు కూడా చేయలేని రొమాన్స్ చేస్తామని ఆఫర్స్ ఇస్తున్నారు. తాజాగా హిరోయిన్ అంజలి కూడా ఇలాంటి ధైర్యం చేసింది. ఏకంగా లెస్బియన్ పాత్రలో నటిస్తోంది.  

తెలుగులో ఫొటో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు, డిక్టేటర్ వంటి సినిమాలు చేసినా ఆమెకు కోరుకున్న ఇమేజ్ రాలేదు. దీంతో తమిళంలో వరుస సినిమాలు చేస్తుంది. కాగా, నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ చిత్రీకరిస్తున్న ‘పావ కదైగాల్’ అనే సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కల్కి కొచ్లిన్ తో అంజలి లెస్బియన్ గా నటించింది. 

ఈ సినిమాలో ఓ ఎపిసోడ్ కోసం ఈమె అలాంటి పాత్ర చేసింది. ఈ సినిమాను నలుగురు అగ్ర దర్శకులు పనిచేస్తున్నారు. నాలుగు భిన్నమైన కథలను ముడిపెడుతూ ఈ సినిమా ఉంటుంది. అంజలి, కల్కి ఉన్న భాగాన్ని విఘ్నేష్ చిత్రీకరిస్తుండగా, గౌతమ్ మీనన్, సుధ కొంగర, వెట్రిమారన్ మిగిలిన మూడు భాగాలు తెరకెక్కిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, సాయి పల్లవి కూడా నటిస్తున్నారు.  

 

Leave a Comment