వామ్మో ఆమె పాటకు పాపం ఆ కొత్త జంట పరిస్థితి చూడండి..ఒకసారి మీరూ వినండి..

ఫంక్షన్ కదా పాట పాడమని అడిగినందుకు పాపం ఆ కొత్త జంటకు మూర్ఛ వచ్చేలా చేసింది ఆ మహిళ. తన పాటతో ఆ కొత్త జంటను సిగ్గుతో గోడకు అతుక్కుపోయేలా చేసింది. ఓ జంటకు కొత్తగా పెళ్లయింది. వారికి స్వాగతం పలుకుతూ ఓ పెద్దావిడను పాట పాడమని అడిగారు. అంతే ఆ పెద్దావిడ మాత్రం ఎన్టీఆర్, సావిత్ర నటించిన దేవత సినిమాలోని పాటను పాడింది. ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి’ అంటూ ఒక రకమైన గొంతుతో పాడుతూ ఆ పాట ఖూనీ చేసేసింది..

2 నిమిషాల కంటే ఎక్కువ నిడివి గల ఈ పాటను ఆమె పాడుతూ అందర్నీ జుట్టు పీక్కునేలా చేసింది. ఆమె అదో రకమైన స్వరంతో పాట పడుతుంటే అక్కడ ఉన్న వారు పడిన అవస్థలు చెప్పలేనివి. ఇక కొత్త జంట అయితే ఏం చేయాలో అర్థంకాక గోడకు అతుక్కుపోయింది. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతంలో జరిగిందో తెలీదు కానీ.. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫంక్షన్లలో ఎవరినీ తొందరపడి పాడమని అడగకండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment