మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్..!

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్ అయ్యారు. టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో హర్యానా పోలీసులు ఈ మాజీ ఆల్ రౌండర్ ను ఆదివారం అరెస్ట్ చేశారు. వెంటనే అతన్ని బెయిల్ పై విడుదల చేశారు.

గతేడాది జూన్ లో టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి యువరాజ్ ఓ లైవ్ సెషన్ లో పాల్గొన్నాడు. ఆ సమయంలో క్రికెటర్ చహల్ సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. యువరాజ్ వ్యాఖ్యలు కుల అహంకార్ని సూచిస్తున్నట్లు ఓ న్యాయవాది హిస్సార్ పరిధిలోని హాన్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాక్ డౌన్ అనంతరం ఈ ఫిర్యాదుపై హిస్సార్ పోలీసులు విచారణ జరిపారు. యువరాజ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాగా ఈ వివాదంపై అప్పట్లో యువరాజ్ క్షమాపణలు కూడా కోరాడు. ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరుతూ ట్వీట్ చేశాడు. 

Leave a Comment