ఏపీలో ఉద్యోగాల జాతర.. జాబ్ క్యాలెండర్ 2021-2022

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల జాతర మొదలైంది. రాష్ట్రంలో 10,143 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. 2021-22 లో వివిధ శాఖల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది జూలై నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు వివిధ దశల్లో పోస్టులను భర్తీ చేయనుంది. 

కాగా,  విద్య, వైద్యం, పోలీస్ శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, డీఎస్సీ తదితర నియామక సంస్థల ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. వచ్చే నెల నుంచే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.  పారదర్శకంగా, అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 

2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,03,756 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో రెగ్యులర్ పోస్టులు 1,84,264, కాంట్రాక్టు పోస్టులు 19,701, అవుట్ సోర్సింగ్ పోస్టులు 3,99,791 ఉన్నాయి. తాజాగా 10,143 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ ను సీఎం జగన్ విడుదల చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా, ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో రాష్ట్రంలో నియమాకాలు జరిపారు..

ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాల వివరాలు:

 

కేటగిరీ ఖాళీలు నోటిఫికేషన్ ఇచ్చే నెల/సంవత్సరం
బ్యాక్ లాగ్ వేకెన్సీలు – ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 1,238 జూలై 2021
ఏపీపీఎస్సీ – గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 36 ఆగస్టు 2021
పోలీస్ శాఖ ఉద్యోగాలు 450  సెప్టెంబర్ 2021
వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 451 అక్టోబర్ 2021
పారామెడికల్ సిబ్బంది, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ లు 5,251 నవంబర్ 2021
నర్సులు 441 డిసెంబర్ 2021
డిగ్రీ కాలేజీల లెక్చరర్లు 240 జనవరి 2022
యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు 2,000 ఫిబ్రవరి 2022
ఇతర శాఖలు 36 మార్చి 2022

 

భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు 10,143

 

Leave a Comment