ఈ పోలీసుల తీరుతో.. ఓ పోలీస్ అధికారి సస్పెండ్..

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో రాళ్ల దాడి నుంచి తప్పించుకునేందుకు ప్లాస్టిక్ కుర్చీ, వెదురుతట్ట ఉపయోగించారు. ఈఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో పోలీసులపై జోకులు పేలాయి. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు. 

ఇంతకు ఏం జరిగిందంటే.. రాష్ట్రంలోని అక్రంపూర్ లో మంగళవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మృతదేహాలతో ధర్నా చేసి రోడ్డును దిగ్బంధం చేశారు. వీరిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించాయి. 

అయితే రెచ్చిపోయిన గ్రామస్తులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. గ్రామస్తుల రాళ్ల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ పోలీస్ ప్లాస్టిక్ స్టూల్ ను హెల్మెట్ గా ధరిస్తే, మరో పోలీసులు వెదరుబుట్ట మూతను కవచంగా పట్టుకున్నారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరణ కోరారు. 

Leave a Comment