ఏపీలో కర్ఫ్యూ వేళల్లో సడలింపు..!

కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో విధించిన కర్ఫ్యూ ఈ నెల 20తో ముగియనుంది. ఈనేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూను ఈనెల 30 వరకు పొడిగించింది. అలాగే కర్ఫ్యూ వేళల్లో ప్రభుత్వం సడలింపులు చేసింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు అమల్లో ఉంటాయని తెలిపింది. 

జూన్ 21 నుంచి 30 వరకు సడలింపులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. అయితే సాయంత్రం 5 గంటల వరకే దుకణాలకు అనుమతించింది. తూర్పు గోదావరి జిల్లాలో కోవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉండటంతో ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఇచ్చింది. ఇక ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తాయని వెల్లడించింది. 

Leave a Comment