యాంకర్ శ్యామల, భువనేశ్వర్ అక్కా తమ్ముళ్లా?

సోషల్ మీడియాలో ఏదైనా వార్త వస్తే అది క్షణాల్లో వైరల్ అవుతుంది.. అసలు అది నిజమో, అబద్ధమో తెలియక నెటిజన్లు అయోమయానికి గురవుతుంటారు.. కొన్ని రోజులుగా యాంకర్ శ్యామలకు క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ కు మధ్య సంబంధం ఏంటో తెలుసా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. వీరిద్దరు అక్కా, తమ్ముళ్లని అందుకే వీరిద్దరికి దగ్గరి పోలీకలు ఉంటాయనే  వార్త హల్ చల్ చేసింది. 

 ఈ విషయం శ్యామల దగ్గరకు వెళ్లడంతో దీనిపై ఆమె స్పందించింది. ‘నేను భువనేశ్వర్ అక్కా తమ్ముళ్లమా, ఈ విషయం నాకే తెలియదు.. వాళ్లకేం తెలుస్తంది’ అంటూ సెటైర్ వేసింది. దీంతో శ్యామల, భువనేశ్వర్ అక్కా తమ్ముళ్లు అంటూ వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదని తేలిపోయింది. 

Leave a Comment