అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్టులో సంచలన విషయాలు.. భారత్ తో సహా 11 దేశాల్లో..

ప్రపంచ దేశాలను ప్రకృతి వైపరీత్యాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల భారత్ లోని కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడిపోయాయి. ఈక్రమంలో అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాతావరణ మార్పులపై సంచలన విషయాలు వెల్లడించింది. భారత్ , పాకిస్తాన్ సహా 11 దేశాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ హెచ్చరించింది. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే సంక్షోభాలను ఎదుర్కోవడంలో సంసిద్ధత, ప్రతిస్పందించే సామర్థ్యంలో ఈ దేశాలు అత్యంత వెనుకబి ఉన్నాయని నివేదికలో తెలిపింది. 

ఇక కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేస్తున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ నాలుగో స్థానంలో ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది. కర్బన ఉద్గారాలను పెంచుతూనే ఉన్నాయని చెప్పింది. ఇక రెండు, మూడు స్థానాల్లో ఉన్న అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఉద్గారాలను తగ్గిస్తున్నట్లు చెప్పింది. 

కొన్ని రోజుల్లో ప్రపంచ వాతావరణ మార్పులపై సమావేశం జరుగనుంది. ఈక్రమంలో అమెరికా ఇంటెలిజెన్స్ విడుదల చేసిన రిపోర్ట్ ఆసక్తికరంగా మారింది. భారత్, పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ సహా 11 దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదిక వెల్లడించిది. ఈ దేశాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయని, ఇవి వాతావరణ మార్పులకు దారి తీస్తాయని పేర్కొంది. దీని కారణంగా ఆహారం, నీరు, ఆరోగ్య భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. వాతావరణ మార్పులతో తుఫానులు ఏర్పడి నీటి వనరులు కలుషితమవుతాయని, దీని వల్ల అంటువ్యాధులు ప్రబలే ముప్పు ఉందని నివేదిక స్పష్టం చేసింది.  

 

Leave a Comment