డెల్టా కంటే ప్రమాదకరంగా మారిన సబ్ వేరియంట్..!

ప్రస్తుతం ఇండియా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రం కరోనా ఉధృతి ఇంకా తగ్గలేదు. రష్యాలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. రష్యాలో డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరంగా ఉంటే సబ్ వేరియంట్ ని నిపుణులు గుర్తించారు. ఇది డెల్టా కంటే 10 శాతం ఎక్కువ వేగంగా విస్తరిస్తున్నట్లు కనుగొన్నారు.

రష్యాలో కరోనా వైరస్ ను AY.4.2 వేరియంట్ గా గుర్తించారు. దీని కారణంగా రష్యాలో ప్రతిరోజూ కొత్త కరోనా పెరిగిపోతున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ ప్రమాదకర సబ్ వేరియంట్ పై ప్రభావవంతంగా పోరాడుతుందని రష్యన్ పరిశోధకుడు ఖఫీజోవ్ చెప్పారు. 

ఇక బ్రిటన్ లోనూ AY.4.2 వేరియంట్ కారణంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని యూకే హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ వేరియంట్ కారణంగా సెప్టెంబర్ 27 నుంచి ఇప్పటివరకు 6 శాతం కరోనా కేసుల పెరుగుదల కనిపించింది. ఈ కొత్త వేరియంట్ కారణంగా రష్యా, బ్రిటన్ దేశాల్లో నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారు. 

Leave a Comment