అల్లు అర్జున్ కూతురు ‘అంజలి’ వీడియో సాంగ్.. వైరల్..!

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ నేడు తన నాలుగో పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. తన కూతురు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ‘అంజలి అంజలి’ అనే పాటను మళ్లీ రీ క్రియేట్ చేసి వీడియో సాంగ్ ను విడుదల చేశారు. 

మణిరత్నం-ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన మ్యూజికల్ హిట్ ‘అంజలి’లోని పాటలో బేబీ షామిలి నటనతో అలరించింది. ఈ పాటలో అర్హ కూడా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది. ఇందులో అర్హతో పాటు తన సోదరుడు అయాన్ కూడా నటించాడు. చివర్లో అల్లు అర్జున్, తాతయ్యలు అల్లు అరవింద్, కేసీ శేఖర్ రెడ్డి కూడా కనిపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

  

Leave a Comment