గంటలో పెళ్లి.. లవర్ ఉన్నడంటూ ట్విస్ట్ ఇచ్చిన వధువు..!

పెళ్లి పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడం మనం ఎక్కువగా సినిమాలో చూస్తుంటాం..నచ్చని వ్యక్తితో పెళ్లి పీటలెక్కి లవర్ ఉన్నాడంటూ ట్వీస్ట్ ఇస్తుంటారు.. అలాంటి సీనే నిజంగా రిపీట్ అయింది. మరో గంటలో పెళ్లి తంతు ముగుస్తుందనగా..నాకు పెళ్లి ఇష్టం లేదని, ఇతడ్ని పెళ్లి చేసుకోనని మొండికేసింది. ప్రియుడ్ని కూడా రంగంలోకి దింపింది. ప్రియుడితో పాటు పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు. దీంతో మొత్తం సీన్ మారిపోయింది. 

ఏం జరిగిందంటే.. ఏపీలోని కడప జిల్లాకు చెందిన ఓ యువతి చెన్నైలోని సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తోంది. అక్కడ తనతో పాటు పనిచేసే ఓ యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులు ఆమెకు చిత్తూరు జిల్లాలోని గుర్రంకొండకు చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించారు. శుక్రవారం ముహూర్తం కూడా పెట్టారు.  అయితే ఆమె ప్రేమించిన విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు. 

ఇక ఇరు కుటుంబాల బంధవులు, పెద్దల సమక్షంలో పెళ్లికి ముందు జరిగే రిసెప్షన్ కూడా జరిగింది. అప్పటికీ ఆమె విషయాన్ని దాచే ఉంచింది. ఇక ముహూర్తం దగ్గర పడుతుండగా ఆమె ప్రియుడు ఎంట్రీ ఇచ్చాడు. అతడితో తనతో పాటు పోలీసులను కూడా తీసుకొచ్చాడు. ఇరు కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పారు. 

దీంతో ఆ పెళ్లి కూతురిని ఈ విషయాన్ని అడిగారు. అప్పటి వరకు నోరు తెరవని వధువు, నోరు విప్పి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానని అందరినీ షాక్ ఇచ్చింది. అంతే వరుడు షాక్ అయ్యాడు. పెళ్లి పీటల నుంచి లేచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక వాళ్లిద్దరికి పోలీసులు పెళ్లి చేసి పంపించారు.. 

Leave a Comment