RRR Update : సీత పాత్రలో అలియా భట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ కావడంతో ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. 

కాగా, ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తోంది. సోమవారం అలియా భట్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న సీత పాత్రను పరిచయం చేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్.. చీరకట్టులో అలియా లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. 

ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, సముద్రఖని, శ్రియ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యం.యం.కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.    

Leave a Comment