కొవాగ్జిన్ వాక్సిన్ తీసుకున్నవారికి అలర్ట్.. భారత్ బయోటెక్ కీలక ప్రకటన..!

కరోనా నియంత్రణలో భాగంగా కొవిడ్ వ్యాక్సిన్ ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ,నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో “కొవాగ్జిన్” టీకాను భారత్‌ బయోటెక్‌ కంపెనీ అభివృద్ధి చేసింది. కొవాగ్జిన్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన టీకా. వైరల్ ప్రోటీన్లను తట్టుకునేలా కొవాగ్జిన్ రూపొందించామని సంస్థ తెలిపింది.

ఈ సంవత్సరం 2022 జనవరి 3 నుంచి  15-18 ఏళ్ల వయసు ఉన్న టీనేజర్స్ కి కోవిడ్ వ్యాక్సిన్ పంపీణీ జరుగుతోన్న విషయం  దేశంలో  అందరికి తెలిసిందే. ఇప్పటికే దేశం మొత్తము మీద సుమారు 148 కోట్ల డోసుల వ్యాక్సిన్లను కేంద్రం పంపిణీ చేసింది.వ్యాక్సిన్​ తీసుకునేందుకు కొన్ని చోట్లా భయపడుతుంటే మరికొన్ని చోట్లా ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. అయితే ఈ సమయంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది.

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పారాసెటమాల్​ లేదా పెయిన్​ కిల్లర్స్​ వాడాల్సిన పనిలేదని,తాము అలా సూచించలేదని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ట్విట్టర్​లో ఓ ప్రకటన చేసింది.

భారత్ బయోటెక్ తన ప్రకటనలో….కొవాగ్జిన్​ వ్యాక్సిన్​ పొందిన పిల్లలకు ఆయా టీకా కేంద్రాల్లో పారాసెటమాల్​ 500 ఎంజీ. టాబ్లెట్లు 3 చొప్పున ఇస్తున్నట్లు మాకు తెలిసింది. కొవాగ్జిన్​ తీసుకున్నవారు పారాసెటమాల్​ కానీ, పెయిన్​ కిల్లర్స్​ కానీ వాడాల్సిన పనిలేదు. 30 వేలమందిపై మేం క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించాం. 10 నుంచి 20 శాతం మందికే సైడ్​ ఎఫెక్ట్స్​ వచ్చాయి. అవి కూడా చిన్నవే. ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది. ఎలాంటి మందులు వాడొద్దు. డాక్టర్ ని సంప్రదించాకే మెడికేషన్​ పాటించండి. వేరే ఇతర వ్యాక్సిన్లు తీసుకున్నవారికి  పారాసెటమాల్​ తీసుకోవాలని సూచించారు. కొవాగ్జిన్​కు అవసరం లేదు”అని తెలిపింది. 

వాక్సిన్ తీసుకునేముందు తీసుకోవాలిసిన కొన్ని జాగ్రత్తలు

1.ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ తీసుకోకండి.

  1. వాక్సిన్ తీసుకోవడానికి ముందు కడుపు నిండా బాగా తినండి.
  2. రోగనిరోధక శక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకు కూరలు, ఆహారాన్ని తీసుకోండి.
  3. నీరు ఎక్కువగా తాగాలి. శరీరం డిహైడ్రైషన్‌కు గురికాకుండా చూసుకోవాలి.
  4. వ్యాక్సిన కేంద్రానికి వెళ్లినప్పుడు తప్పకుండా కోవిడ్-19 నియమాలు పాటించాలి.

వ్యాక్సిన్ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు:

  1. వాక్సిన్  తీసుకున్న వేసిన తరువాత, టీకా కేంద్రంలో 15-30 నిమిషాలు కూర్చోండి. ఆ సమయంలో ఆరోగ్య కార్యకర్తలు మిమ్మల్ని పర్యవేక్షిస్తారు.
  2. మైకం లేదా వికారం, వాంతులు లేదా ఏదైనా అలెర్జీలు ఉంటే వెంటనే చెప్పండి.
  3. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పుష్కలంగా ద్రవాలు తాగాలి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచండి.
  4. వ్యాక్సిన్ తర్వాత మద్యం, స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి.
  5. వ్యాక్సిన్ పొడిచిన చోట మీకు నొప్పిగా ఉంటే.. చేతిని కాస్త వదులుగా ఉంచండి.
  6. వ్యాక్సిన్ పొడిచన చోట వాపు కనిపిస్తే.. అక్కడ చల్లని లేదా తడి వస్త్రం ఉంచండి.

 

Leave a Comment