కేరళలో వింత.. బోరు బావి నుంచి వంట గ్యాస్..!

ప్రస్తుతం వంట గ్యాస్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న గ్యాస్ ధరతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. పెరిగిన వంట గ్యాస్ ధరలో పేద కుటుంబాల జేబులకు చిల్లులు పడుతున్నాయి. కానీ ఒక ఫ్యామిలీ మాత్రం మార్కెట్ లో వంట గ్యాస్ ధరలు ఎంత పెరిగినా భయపడదు. ధరలను పట్టించుకోకుండా వంట గ్యాస్ ని ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే వారికి కావాల్సిన గ్యాస్ ఇంట్లోనే లభిస్తోంది. నీటి కోసం తవ్వించి బోరు బావి నుంచి వంట గ్యాస్ వస్తోంది.. ఈ గ్యాస్ నే వారు గత 9 సంత్సరాలుగా వాడుతున్నారు. ఈ ఘటన కేరళలోని అలప్పుజ జిల్లాలో జరిగింది.

జిల్లాలోని అరుత్తువళి ప్రాంతంలో రత్నమ్మ కుటుంబం నివాసం ఉంటుంది. వీరికి ఆ ప్రాంతంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. దీంతో రత్నమ్మ కుటుంబం బోరు తవ్వించాలని నిర్ణయించుకుంది. 16 మీటర్ల వరకు బోరు తవ్వినా చుక్క నీరు పడలేదు. అదేసమయంలో పైపుల దగ్గర ఉన్న ఓ వ్యక్తి అగ్గిపుల్లను వెలిగించాడు. అంతే భగ్గమని మంటలు వచ్చాయి. అయితే దీనిని వారు పట్టించుకోలేదు.. 

బోరు తవ్విన చోట గ్యాస్ లీక్ అవుతోంది. దీంతో రత్నమ్మ కుటుంబ కంగారుపడింది. ఈ విషయం తెలిసి అధికారులు ఆమె ఇంటికి వచ్చి బోరు బావి వద్ద పరీక్షలు చేశారు. బోరు బావి నుంచి వస్తున్నది మీథేన్ అని గుర్తించారు. దీని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు తెలిపారు. ఆ తర్వాత బోరు నుంచి పొయ్యికి పైపులు బిగించి గ్యాస్ వినియోగించుకుంటుంది. 9 సంవత్సరాలుగా ఆ కుటుంబానికి వంట గ్యాస్ కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం రాలేదు. ఈ ఫ్యామిలీ ఎంతో లక్కీ కదూ..  

 

Leave a Comment