అక్కడ మద్యం హోమ్‌ డెలివరీ !

 దేశంలో కరోనా వైరస్ ప్రభావం విపరీతంగా పెరుగుతోంది. కరోనాను అరికట్టడానికి ప్రధాని లాక్ డౌన్ విధించారు. దీంతో ఎక్కడ కూడా దుకాణాలు తెరుచుకోవడం లేదు. దీంతో మద్యం ప్రియులకు మద్యం దొరక్కపోబడంతో విపరీత చేష్టలకు దిగుతున్నారు. వీరి పరిస్థితిని దృష్టి ఉంచుకుని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మద్యం హోమ్ డెలీవరీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి హెమ్ డెలివరీ చేయాలని వ్యాపారులకు అనుమతులు ఇచ్చింది. 

లాక్‌డౌన్‌ సమయంలో మద్యం అమ్మకాలపై నిషేధం లేదని, అయితే వ్యాపారులు దుకాణాలు తెరవడానికి వీలు లేకపోవడంతో మద్యం హోమ్‌డెలివరీ చేసేందుకు అనుమతిచ్చామని ఆ రాష్ట్ర ఎక్సైజుశాఖ తెలిపింది. ఇందుకుగానూ వ్యాపారులు తమ ప్రాంతంలోని ఎక్సైజుశాఖ, పోలీస్‌శాఖ కార్యాలయాల వద్ద అనుమతి పత్రాలు తీసుకోవాలని పేర్కొంది. ప్రతి దుకాణానికీ కేవలం మూడు పాస్‌లు మాత్రమే మంజూరు చేస్తామని తెలిపింది.

మద్యంప్రియులు ఉదయం 11 నుంచి మధ్యహ్నం 2 వరకు ఫోన్‌ ద్వారా ఆర్డర్‌ పెట్టుకోవాలని, ఆ తర్వాత 2 నుంచి 5 గంటల దాకా డెలివరీ చేస్తారని  ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మిఠాయిషాపులూ నిర్ణీత సమయంలో వ్యాపారం చేసుకునేలా లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

 

Leave a Comment