సబ్బులు అమ్ముకుంటున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..!

సినీ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్నంత వరకే.. ఒక్కసారి కెరీర్ డౌన్ ఫాల్ అయితే మాత్రం వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకప్పటి హీరోయిన్ ఐశ్వర్య భాస్కరన్ ని చూస్తే తెలుస్తుంది.. ప్రముఖ టాలీవుడ్, కోలీవుడ్ నటి లక్ష్మి కూతురు.. నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 200లకు పైగా సినిమాల్లో నటించింది. 

అంత పెద్ద నటి ఎంతో దర్జాగా జీవిస్తూ ఉంటుందని అనుకుంటున్నారా..లేదు.. కొన్నాళ్లుగా ఆమెకు సినిమాల్లో అవకాశాలు లేక దారుణమైన జీవితాన్ని గడుపుతోంది.. మూడు పూటల తినలేని పరిస్థితిలో ఉంది. పొట్టకూటి కోసం ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్ముకుంటోంది. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పింది.. ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పింది. 

ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరుస ఆఫర్లు అందుకుంటూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పక్కన బటర్ ఫ్లయిస్, నరసింహం, ప్రజా లాంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆఫర్లు లేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఎన్నో టీవీ సీరియల్స్ లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆఫర్లు లేకపోవడంతో ఆమె సబ్బులు అమ్ముకుంటూ జీవితం కొనసాగిస్తోంది.. 

ప్రస్తుతం తాను సబ్బులు అమ్ముకుని జీవిస్తున్నానని ఐశ్వర్య చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితిలో తాను ఏ పనిచేయడానికైనా సిద్ధమని తెలిపింది. ఏదైన ఆపీస్ లో జాబ్ ఇస్తానంటే తప్పకుండా చేస్తానని, అవసరమైతే టాయిలెట్స్ కూడా క్లీన్ చేస్తానని పేర్కొంది. ప్రస్తుతం ఓ యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తూ సబ్బులు అమ్ముతున్నానని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే తనకు ఏదైనా సీరియల్ ఆఫర్ కావాలని కోరింది. 

 

 

Leave a Comment