పెళ్లయి మూడేళ్ల తర్వాత భర్త గే అని తెలిసింది.. విడాకులు కోరిన భార్య..!

పెళ్లయిన మూడేళ్లకు భర్త  గే అని తెలిసి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు విడాకులు ఇప్పించాలని కోరింది. ఈ ఘటన గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. ఏంజరిగిందంటే.. మూడేళ్ల క్రితం ఓ జంటకు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఇక మొదటి రాత్రి పై ఎన్నో ఆశలతో గదిలోకి అడుగుపెట్టింది ఆ పెళ్లి కూతురు. కానీ ఆమె వచ్చేప్పటికే భర్త నిద్రపోతూ కనిపించాడు. ఏమో అనుకుంది. 

ఇక రెండో రాత్రి వచ్చింది. గదిలోకి రాగానే అర్జెంట్ పోన్ కాల్ అంటూ బయటకు వెళ్లి ఉదయం వచ్చాడు. ఇక మూడో రాత్రి గదిలో ల్యాప్ టాప్ పెట్టుకుని కూర్చున్నాడు. ఏదో సమస్య వచ్చిందంటూ పనిలో బిజీగా ఉన్నాడు. ఇలా మూడు రాత్రులూ ముగించాడు. ఆ మూడు రాత్రులు భార్యను టచ్ కూడా చేయలేదు. 

ఇలా ఏవేవో సాకులు చెబుతూ శోభనాన్ని దాటవేస్తూ వచ్చాడు. ఇలా రోజులు, నెలలు, ఏకంగా సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా భార్యకు సుఖాన్ని అందించలేదు. దీంతో ఆమెలో సహనం నశించింది. ఓ రోజు తన భర్త మొబైల్ లో వాట్సాప్ చెక్ చేసింది. అంతే తన భర్త వేరే మగాడితో సరసాలాడే ఫొటోలు చూసి షాక్ కు గురైంది. తన భర్త గే అని తెలుసుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెకు త్వరలోనే విడాకులు వచ్చేలా చూస్తామని చెప్పారు.  

 

Leave a Comment