సోనూసూద్ కు అరుదైన గౌరవం..పంజాబ్ స్టేట్ ఐకాన్ గా నియాకం..!

కరోనా కాలంలో సోనూసూద్ వలస కార్మికుల పాలిట దేవుడయ్యాడు. ఎంతో మంది వలస కార్మికులను తమ సొంత ప్రాంతాలకు తరలించేదుకు సహాయపడ్డాడు. అంతే కాదు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారికి తన సహకారం అందించాడు. ప్రస్తుతం సోనూసూద్ పేద విద్యార్థుల కోసం స్కాలర్ షిప్ లు కూడా అందిస్తున్నాడు. 

సోనూ సూద్ చేసిన మంచి పనులకు ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. సోనూసూద్ ను ‘పంజాబ్ స్టేట్ ఐకాన్’ గా భారత ఎన్నికల సంఘం నియమించింది. ఈసీఐకి ప్రతిపాదన పంపామని, ఈ ప్రతిపాదనను ఈసీఐ అంగీకరించిందని పంజాబ్ స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కరుణ రాజు పేర్కొన్నారు. కాగా సోనూ సూద్ పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాకు చెందిన వ్యక్తి.   

Leave a Comment