జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. డిసెంబర్ 1న ఓటింగ్..!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ తో పాటు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 4న కౌంటింగ్ జరుగుతుంది. 

రేపటి నుంచి డివిజన్ల వారీగా నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు నవంబర్ 20 చివరి తేదీ కాగా, నవంబర్ 21న నామినేషన్లు పరిశీలిస్తారు. నవంబర్ 22 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది. బ్యాలెట్ పద్ధతిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి.  

 

Leave a Comment