నటి ఆషిమా నార్వల్ దమ్ము కొడుతూ బాలయ్యా డైలాగ్ చెబుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆషిమా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తోంది. తెలుగు నాటకం, జెస్సీ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈమె తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. కాగా ఆషిమా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది.
ఆ వీడియోలో సిగరేట్ తాగుతూ హీరో బాలక్రిష్ణ సినిమా డైలాగ్ చెబుతోంది. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్..ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్.. ట్రబుల్ ట్రబుల్స్ యు.. ఐయామ్ నాట్ ద ట్రబుల్.. ఐయామ్ ద ట్రూత్ అంటూ శ్రీమన్నారాయణ సినిమా డైలాగ్ చెప్పింది. కాగా తాను నటిస్తున్న ఓ తెలుగు సినిమాలో పాత్ర కోసం ఇలా సిగరెట్ తాగడం ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఆషిమా తెలిపింది.
ఇంకా తన పోస్ట్ లో ఏం రాసిందంటే.. మనమంతా భూమాతను ఇబ్బంది పెడుతున్నాం.. అందుకే భూమాత తిరిగి మన్నల్ని ఇబ్బంది పెడుతోంది. అందుకే భూమిని ఇబ్బంది పెట్టవద్దు. భూమి అనేది ట్రబుల్ కాదు. అదే అసలైన నిజం. అంటూ కామెంట్స్ చేసింది. ఇక తాను సిగరెట్ తాగడం చూసి షాకయ్యే వారిని ఉద్దేశించి ఇలా కామెంట్స్ చేసింది.. స్కూటర్లు, కార్లు, ఫ్యాక్లరీల పొగతో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. దాని గురించి ఎవరూ షాకవ్వట్లేదు. కానీ అదే ఎక్కవగా షాక్ గురవ్వాల్సిన విషయం. అంటూ పోస్టలో పేర్కొంది.