వృద్దుడిని బతికుండగానే.. ఫ్రీజర్ లో పెట్టారు..!

ఈ రోజుల్లో మానవత్వం మంటగలుస్తోంది. ఇక వృద్దులపై అయితే ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. వీరు ఎప్పుడు పోతాడురా బాబు అని ఎదురు చేసే వారు కూడా ఉన్నారు. అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో జరిగింది. ఒక వృద్దుడిని ప్రాణాలతో ఉండగానే శవాలను ఉంచే ఫ్రీజర్ లో పెట్టింది ఓ కుటుంబం. కాగా ఈ వృద్దుడు ఎప్పుడు మరణిస్తాడా అంటూ ఎదురుచూసింది. 

వివరాల మేరకు తమిళనాడులోని సేలం కందపట్టి హౌసింగ్ బోర్డుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి బాలసుబ్రమణ్య కుమార్(70) తన సోదరుడు శరవణన్, బంధువులు జయశ్రీ, గీతలతో కలిసి ఉంటున్నాడు. గతేడాది ఆయన భార్య మరణించింది. ఆయనకు పిల్లలు ఎవరూ లేరు. అయితే గత నెలలో బాలసుబ్రమణ్య కుమార్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో బంధవులు ఆయనను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉందని, బతకడం కష్టమని వైద్యులు వెల్లడించారు. 

ఇక చేసేది లేక బంధువులు ఆయనను మంగళవారం ఇంటికి తీసుకొచ్చారు. అయితే కొద్ది సేపటికి బాలసుబ్రమణ్య కుమార్ కోమాలోకి వెళ్లాడు. దీంతో తన అన్నయ్య మరణించాడని భావించిన తమ్ముడు శరవణన్ అంత్యక్రియలకు ఏర్పాటు చేశాడు. శవాలను పెట్టే ఫ్రీజర్ బాక్స్ ను ఇంటికి తెప్పించాడు. కాళ్లు చేతులు కట్టి మృతదేహంలా తన సోదరుడిని ఆ బాక్స్ లో పడుకోబెట్టాడు. తన అన్న ఎప్పుడు చనిపోతాడా అని రాత్రంతా ఎదురు చూశాడు..

అయితే ఫ్రీజర్ బాక్స్ అద్దెకి ఇచ్చిన వ్యక్తి దాన్ని తీసుకెళ్లేందుకు బుధవారం ఉదయాన్నే ఇంటికి వచ్చాడు. ఆ వ్యక్తి ఫ్రీజర్ లో బాలసుబ్రమణ్య కుమార్ శరీరంలో చలనం కనిపించింది. కళ్లు తెరుచుకుని ఉపిరీ పీల్చలేని స్థితిలో ఉన్నాడు. ఇది గమనించిన ఆ వ్యక్తి శరవణన్ కు చెప్పాడు అయినా అతను పట్టించుకోలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చిన బాలసుబ్రమణ్య కుమార్ ను ఫ్రీజర్ నుంచి తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలసుబ్రమణ్య కుమార్ చికిత్స పొందుతున్నారు. శరవణన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Leave a Comment