నటి ఖుష్బూ కారును ఢీకొట్టిన ట్యాంకర్.. !

తమిళ నటి, బీజేపీ నేత ఖుష్బూ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం మెల్వార్ వతూర్ సమీపంలో కారును ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో కారు ఒకవైపు డోర్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఖుష్బూకు ఎలాంటి గాయాలు కాలేదు. కారులోని వారంతా క్షేమంగా బయటపడ్డారు. 

కడలూరులోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించి ఖష్బూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దేవుడి దయవల్ల ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా బయటపడ్డామని పేర్కొన్నారు. అయితే తన కడలూరు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆమె వెల్యాత్రాయ్ లో పాల్గొన్నట్లు చెప్పారు.  

 

Leave a Comment