జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. సబ్సీడీకి రేషన్ సరఫరా వాహనాలు..!

నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. రేషన్ సరఫరా చేసే వాహనాలను వివిధ వర్గాలకు అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రేషన్ సరఫరా ట్రక్కులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 9 వేలకు పైగా మినీ మొబైల్ ట్రక్కులను కేటాయించింది. వాటిలో ఎస్సీ వర్గానికి 2300 కేటాయించగా, మైనార్టీలకు 600 ట్రక్కులను కేటాయించింది. 

జిల్లాల జనాభా నిష్పత్తి ఆధారంగా ట్రక్కులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ వాహనాలపై 60 శాతం సబ్సిడీ ఉంటుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 30 శాతం బ్యాంక్ లోన్ లభిస్తుంది. మిగితా 10 శాతాన్ని లబ్ధిదారుల వాటాగా నిర్ణయించింది. ఒక్కో ట్రక్కు ధర రూ.5,81,190గా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ సబ్సిడీ వాహనాల కోసం ఈనెల 20 నుంచి 27 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని, వచ్చే నెల 5న అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది.  

Leave a Comment