కోపంతో ఫోన్ విసిరి కొట్టిన బాలయ్య..వీడియో వైరల్..!

హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటారో చెప్పడం కష్టం..ఆయనకు కోపం వస్తే అంతే రియాక్షనే వేరుగా ఉంటుంది. తాజాగా బాలకృష్ణ ఒక సినిమా పోస్టర్ రిలీజ్ ఫంక్షన్ లో కోపంతో ఫోన్ విసిరేశారు. దీంతో అక్కడున్న వారంతా అవాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

హర్ష కనుమల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైన్మెంట్ ‘సెహరి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కు బాలకృష్ణ హజరయ్యారు. కరెక్టుగా పోస్టర్ రిలీజ్ చేసే టైముకు ఆయన ఫోన్ రింగ్ అయింది. అంతే బాలయ్యా బాబుకు కోపం వచ్చేసింది. తన జేబులో నుంచి ఫోన్ తీసి చూసి ఫోన్ ను విసిరేశారు. ఆయన అలా ప్రవర్తించడంతో అక్కడున్న వారు షాక్ కు గురయ్యారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆయను ట్రోల్ చేస్తున్నారు.    

 

 

View this post on Instagram

 

A post shared by Punch Siksha (@punchsiksha)

Leave a Comment