నటి హంసానందినికి క్యాన్సర్..!

టాలీవుడ్ నటి హంసానందిని క్యాన్సర్ బారిన పడింది. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇన్ స్టాగ్రామ్ లో గుండుతో ఉన్న ఫొటోను షేర్ చేసింది.  4 నెలల క్రితం తన రొమ్ములో చిన్న ముద్ద ఉన్నట్లు అనిపించిందని, తన జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండబోదని ఆ క్షణంలోనే తెలిసిందని హంసానందిని పేర్కొంది. 18 ఏళ్ల క్రితం తన అమ్మ కూడా ఇదే వ్యాధితో చనిపోయిందని తెలిపింది. 

తాను బ్రెస్ట్ క్యాన్సర్ గ్రేడ్-3తో బాధపడుతున్నట్లు హంసానందిని వెల్లడించింది. ప్రస్తుతం కీమో థెరపీ చికిత్స తీసుకుంటున్నానని, ఇప్పటికి 9 సైకిల్స్ పూర్తయ్యాయని, మరో 7 సైకిల్స్ ఉన్నాయని తెలిపింది. ఈ వ్యాధితో పోరాడి గెలుస్తానని హంసానందిని దీమా వ్యక్తం చేసింది. పూర్తి ఆరోగ్యంతో తిరిగి సినిమాల్లో నటిస్తానని చెప్పింది. ‘అనుమానస్పదం’ సినిమాలో హీరోయిన్ గా నటించిన హంసానందిని.. ‘మిర్చి’, ‘అత్తారింటికిదారేది’ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లలో అలరించింది. 

 

Leave a Comment