SBIలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల..!

దేశంలోని అతి పెద్ద బ్యాంకింగ్ సంస్థ SBI నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఐదు సర్కిళ్లలో ఏకంగా 12 వందలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయనుంది. 

ఎస్బీఐ నోటిఫికేషన్ వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య : 1226

అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. డిసెంబర్ 1, 2021 నాటికి ఏదైనా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. 

వయసు : డిసెంబర్ 1, 2021 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాత పరీక్ష, స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం : రాత పరీక్షలో భాగంగా ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ 120 ప్రశ్నలు – 120 మార్కులకు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు. డిస్క్రిప్టివ్ టెస్ట్ 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్(లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్) నుంచి ప్రశ్నలు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.  

దరఖాస్తుకు చివరి తేదీ : ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. వివిధ సర్కిళ్లలోని రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికే అప్లయి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 29. 

పరీక్ష తేదీ : 2022 జనవరి 12 నుంచి కాల్ లెటర్స్ జారీ అవుతాయి. జనవరిలో పరీక్ష నిర్వహిస్తారు. 

జీతం : 36,100 – 63,840

వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి : https://ibpsonline.ibps.in/sbircbonov21/

Leave a Comment