కోతుల రివేంజ్.. 250 కుక్కల్ని చంపేశాయ్..!

పగలు మనుషులకే కాదు.. జంతువుల్లో కూడా ఉంటాయనే దానిని ఈ ఘటన నిదర్శనం.. ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్లపై హీరో ప్రతీకారం తీర్చున్నట్లు..  కుక్కలపై కోతులు ప్రతీకారం తీర్చుకున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్ గావ్ లో జరిగింది.

గ్రామంలో గత నెలలో కొన్ని కుక్కలు ఒక కోతి పిల్లను వేటాడి చంపాయి. ఇది కోతుల మందలను బాధించింది. అప్పటి నుంచి అవి కుక్కలపై దాడులకు దిగాయి. ముఖ్యంగా కుక్క పిల్లలు కనిపిస్తే వెంటనే వాటిని ఎత్తుకుపోయి ఎత్తయిన బిల్డింగ్ లేదా చెట్ల మీద నుంచి విసిరికొట్టడం మొదలుపెట్టాయి. అలాగే పెద్ద కుక్కలు ఒంటరిగా కనిపిస్తే మందగా వెళ్లి దాడి చేసి చంపేస్తున్నాయి. 

కోతుల దాడుల్లో దాదాపు 250 కుక్కలు ప్రాణాలు కోల్పోయాయి. కోతులు దాడులతో గ్రామంలో కుక్క అన్నది కనిపించకుండా పోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. కోతుల గురించి అటవీశాఖ అధికారులు ఫిర్యాదు చేశామని, వారు వచ్చి కోతులను పట్టడంలో విఫలమై వెనుదిరిగారని అంటున్నారు. కోతులు కుక్కలపైనే కాకుండా ఇప్పుడు గ్రామస్తుల పిల్లలపై దాడులకు దిగుతున్నాయని గ్రామస్తులు వాపోయారు. అయితే వీటికి సరైన తిండి దొరక్క పోవడంతోనే కోతుల్లో ఆగ్రహం పెరిగి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

 

Leave a Comment